న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్ లో శిల్పాషెట్టి సినిమా
వాషింగ్టన్అగస్ట్ 18: బాలీవుడ్ నటి శిల్పాషెట్టి తొలిసారిగా ఇంగ్లీషులో నటించిన ‘ద డిజైర్- జర్నీ ఆఫ్ ఏ వుమన్’ సినిమా ప్రతిష్టాత్మక న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శనకు ఎంపికయింది. దోస్తానా హిందీ చిత్రంలో చివరిసారిగా తెరపై కనిపించిన శిల్పాషెట్టి ఈ చిత్రం ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆర్. శరత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చైనా స్టార్ జియా యూ సరసన ఆమె నటించింది. సన్యాసినిగా మారిన నృత్యకారిణి పాత్రలో ఆమె కనిపించబోతోంది. ‘ద డిజైర్- జర్నీ ఆఫ్ ఏ వుమన్’ సినిమాను ఈ నెల 22, 24 తేదీల్లో న్యూయార్క్ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించనున్నారని శిల్పాషెట్టి ట్విట్టర్‌లో పేర్కొంది.

Comments