ఒబామా బస్సు యాత్ర

వాషింగ్టన్అగస్ట్ 18:    అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నిరుద్యోగం సహా వివిధ ఆర్థిక అంశాలపై విస్తృత ప్రజాబాహుళ్యానికి తన సందేశాన్ని వినిపించడానికి బస్సు యాత్రను ప్రారంభించారు. కీలకమైన మిన్నెసోట, లోవా, ఇల్లినాయిస్‌లలో ఈ బస్సుయాత్ర సాగుతోంది. 2012లో జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని దీటుగా ఎదుర్కొనేందుకు ఒబామా అప్పుడే రంగంలోకి దిగినట్లు ఈ బస్సుయాత్రను బట్టి అర్థమవుతోంది. ప్రతినిధుల సభలో ఆధిక్యంలో ఉన్న రిపబ్లికన్ పార్టీపై  తన బస్సుయాత్రలో ఒబామా విరుచుకుపడ్డారు. ఆర్థిక సంస్కరణలను, దేశాభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు