రాజీవ్‌ హంతకులకు ఉరిపై ఎనిమిది వారాలు స్టే

చెన్నై,అగస్ట్ 30:  మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ హత్యకేసు నిందితులకు స్వల్పంగా ఊరట లభించింది. రాజీవ్ హంతకులకు సెప్టెంబర్9న అమలు చేయనున్న ఉరిశిక్షపై మద్రాస్ హైకోర్టు మంగళవారం స్టే విధించింది. ఎనిమిది వారాల పాటు ఉరిశిక్ష అమలును న్యాయస్థానం నిలిపివేసింది. నిందితుల తరపున ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మాలనీ వాదించారు. కాగా ఉరిశిక్షను రద్దు చేయాలంటూ కోర్టు వెలుపల పలువురు ఆందోళనకు దిగారు. మరోవైపు రాజీవ్ హంతకులకు ఉరిశిక్ష రద్దు చేయాలని రాష్ట్రపతిని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు