 |
| ‘ఆరక్షణ్’ లో అమితాబ్ |
బిగ్ బి అమితాబ్, సైఫ్ అలీఖాన్, దీపికా పడుకొనె ప్రధాన పాత్రల్లో రూపొందిన ' అరక్షన్ ' సినిమా విడుదలపై మద్రాస్ హై కోర్టు సోమవారం స్టే విధించింది. ఈ సినిమా నిర్మాత ప్రకాష్ ఝా రూ. 3.75 కోట్ల రూపాయలు బకాయి పడటంతో.... డబ్బు చెల్లించే వరకు సినిమా విడుదల ఆపి వేయాలని ఫిరోజ్ నడియావాలా కోర్టును ఆశ్రయించాడు. దీంతో ఆగస్టు 12న విడుదల కావాల్సిన ఆరక్షణ్ సినిమా విడుదల నిలిచి పోయింది. ఇదిలా ఉంటే సినిమాలో దళితులకు సంబంధించిన అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయంటూ పలు రాష్ట్రాల్లో ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. సినిమాలో ఎస్ సి రిజర్వేషన్లను వ్యతిరేకించే విధంగా సన్నివేశాలు ఉన్నాయనది ఆందోళన కారుల వాదన. అయితే ఇందులో అలాంటి వేమీ లేదని సినిమా దర్శక నిర్మాతలు అంటున్నారు. సినిమాలో రిజర్వేషన్లపై చర్చ ఉన్నప్పటికీ అవి ఎవరీని నొప్పించే విధంగా ఉండవని అంటున్నారు.
Comments