కాజల్ బెస్ట్ కో స్టార్....నాగచైతన్య
‘దడ’ షూటింగ్‌లో తనకు కాజల్ కు మధ్య ఏవో మనస్పర్థలు వచ్చాయనే ప్రచారన్ని కొట్టి పారేశాడు నాగచైతన్య. కాజల్ బెస్ట్ కో స్టార్ అని తేల్చేసాడు నాగచైతన్య. అలాగే అనూష్క కీ తనకీ వివాహం అయ్యిందంటూ వచ్చిన వార్తలను సైతం ఆయన కొట్టి పారేస్తూ..నేను పెళ్లి చేసుకుంటే మీడియాని పిలిచి మరీ ఆ సంతోషాన్ని పంచుకుంటానని అన్నాడు. స్టార్ హీరో కొడుకుని కాబట్టి కెరీర్ సజావుగా ఉంటుందనడానికి లేదని, ఆ ప్రభావం ఒకటి, రెండు సినిమాల వరకే ఉంటుందని, ఆ తర్వాత నటుడిగా నిరూపించుకుంటేనే కెరీర్ ఉంటుందని చెప్పుకొచ్చాడు నాగ చైతన్య. ‘బెజవాడ రౌడీలు’ 45 శాతం పూర్తయిందని, కథ నచ్చింద్నే చేశానని ఈ టైటిల్ పెట్టాలన్నది రామ్‌గోపాల్‌వర్మ నిర్ణయమని, ఇదే టైటిల్ ఉన్నా, మార్చినా తన కభ్యంతరం లేదని అంటున్నాడు నాగచైతన్య. కాగా, ' దడ ' తెలుగు సినిమా రిలీజ్ కాకుండానే, బాక్సాఫీసు వద్ద దాని రిజల్ట్ తెలియకుండానే, దాని హిందీ రీమేక్ రైట్స్ హాట్ కేక్ లా సేల్ అయిపోయాయి. ఈ చిత్రం హిందీ రీమేక్ రైట్స్ సుమారు 80 లక్షలకు అమ్ముడుపోయాయని తెలుస్తోంది.

Comments