Sunday, August 28, 2011

అమెరికా తూర్పుతీరాన్ని వణికిస్తున్న ఐరిన్ హరికెన్

నలుగురు మృతి  
వాషింగ్టన్.అగస్ట్ 28:  అమెరికా తూర్పుతీరాన్ని ఐరిన్ హరికెన్ వణికిస్తోంది.  పలు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నార్త్ కరోలినాలో నలుగురు మృతి చెందారు. నార్త్ వర్జీనియా, న్యూజెర్సీ, మేరీల్యాండ్, నార్త్ కరోలినాలలో భారీ వర్షం కురుస్తోంది. ఈ కారణంగా ఏడు వేల విమానాలను రద్దు చేశారు. రోడ్లు, సబ్వేలు, రైల్వేలను మూసివేశారు. 9 రాష్ట్రాలలో అత్యవసరప పరిస్థితిని విధించారు. న్యూజెర్సీ, న్యూయార్క్లలో  భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పారు. న్యూజెర్సీ తీర ప్రాంతవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లమని ఆ రాష్ట్ర గవర్నర్ హెచ్చరించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...