భారత్-రష్యా వీసా ఒప్పందం
మాస్కో,అగస్ట్ 3: భారత్, రష్యాల మధ్య బిజినెస్, టూరిస్టు వీసాల జారీపై గత ఏడాది న్యూఢిల్లీలో కుదిరిన ఒప్పందాన్ని మంగళవారం రష్యా ప్రధాని పుతిన్ నేతృత్వంలోని మంత్రి మండలి ఆమోదించింది. ఇరుదేశాల పౌరులకు వీసాల జారీని సరళతరం చేస్తూ కుదిరిన ఒప్పందాన్ని ఆమోదించిన కేబినెట్ దానిని రష్యా పార్లమెంటు దిగువ సభ ఆమోదానికి పంపింది. పౌరులు, విద్యార్థులు, యాత్రికులు మొదలైనవారి పరస్పర ప్రయాణాలను సులభతరం చేసే ఉద్దేశంతో ఈ ఒప్పందం చేసుకున్నట్లు రష్యా విదేశాంగ ఉప మంత్రి ఆండ్రీ డెనిసోవ్ కేబినెట్‌కు తెలిపారు.
Comments