ముంబైలో ఆ ఇద్దరూ...!
నేనూ.. నా రాక్షసి చిత్రంలో జంటగా చేసిన రాణా, ఇలియానా ఇప్పుడు నువ్వూ నేనూ అంటూ ముంబైలో తరుచూ కలుస్తున్నారుట. వారిద్దరూ ముంబైలో తమ ప్రమోషన్ కోసం ఒకే పీఆర్ ఏజన్సీని నియమించుకున్నారుట. ఇలియానా ప్రస్తుతం హిందీలో బర్ఫీ అనే చిత్రం చేస్తోంది. రాణా.. వర్మ దర్శకత్వంలో డిపార్టమెంట్ చేస్తున్నారు. వీరిద్దరనీ కలిపిన పూరీ జగన్నాధ్ హిందీలో ది బిజెనెస్ మ్యాన్ చిత్రం చేయడానికి ప్లానింగ్ లో ఉన్నాడని సమాచారం. నేనూ నా రాక్షసి తర్వాత ఇలియానాకు తెలుగులో ఏ ఆఫరూ రాలేదు. రాణా మాత్రం ప్రకాష్ తోలేటి దర్శకత్వంలో' నా ఇష్టం ' చేస్తున్నాడు.ఇలియానా కోసం రాణా ..ఆమె చేస్తున్న షూటింగ్ లొకేషన్స్ కు కూడా వెళ్ళి వస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఇద్దరూ బాలీవుడ్ కి కొత్త కావడం తో అక్కడి మీడియా ఫోకస్ ఇపై ఇంకా పడినట్టు లేదు. వ్ఇక డిపార్టమెంట్ లో చేస్తూండటంతో రాణా కంటిన్యూగా ముంబైలోనే ఉంటున్నాడు. కాబట్టి వీరిద్దరూ అక్కడ తరుచు కలుసుకోవచ్చు. రెగ్యులర్ గా పబ్ లకు వెళ్లవచ్చు. హైదరాబాద్ లో దొరకని స్వేచ్చ తో ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు...కదా....

Comments