Saturday, August 6, 2011

ఉత్తమ నటుడు- బాలకృష్ణ...ఉత్తమనటి -నిత్యామీనన్..ఉత్తమ చిత్రం- ‘వేదం’

2010  నంది అవార్డులు ...
హైదరాబాద్, అగస్ట్ 6: నందమూరి  బాలకృష్ణ కు  ‘సింహా’ చిత్రంలో  నటనకుగాను   2010 నంది అవార్డుకు ఉత్తమ నటుడు గా ఎంపికయ్యారు. ఉత్తమనటి అవార్డు నిత్యామీనన్ (అలా మొదలైంది) కు దక్కింది. ‘వేదం’ సినిమా ఉత్తమ చిత్రంగా అవార్డు సాధించింది. ‘సింహా’ చిత్రం ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డును కూడా గెలుచుకుంది. 2010 చలనచిత్ర రంగం నంది అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. విజేతల వివరాలను జ్యూరీ ఛైర్మన్ శంకర్ సభ్యుల సమక్షంలో వెల్లడించారు. వివరాలు...

ఉత్తమ నటుడు- బాలకృష్ణ
ఉత్తమనటి -నిత్యామీనన్
ఉత్తమ చిత్రం-  ‘వేదం’
ఉత్తమ విలన్: వి.నాగినీడు (మర్యాద రామన్న)                  
ఉత్తమ దర్శకుడు: పి.సునీల్‌కుమార్‌రెడ్డి (గంగపుత్రులు)
ఉత్తమ బాలనటుడు: మాస్టర్ భరత్ (బిందాస్)
ఉత్తమ తొలిచిత్ర దర్శకురాలు: నందినీరెడ్డి (అలా మొదలైంది)
ఉత్తమ పాటల రచయిత: నందిని సిధారెడ్డి (వీర తెలంగాణలోని ‘నాగేటిసాళ్లలో నా తెలంగాణ’)
ఉత్తమ పిల్లల చిత్రం: లిటిల్ బుద్ధ
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: ప్రసాద్ మురెల్లా (నమో వెంకటేశా)
ఉత్తమ సంగీత దర్శకుడు: చక్రి (సింహా)
ఉత్తమ కొరియోగ్రాఫర్: ప్రేమ్ రక్షిత్ (అదుర్స్)
ద్వితీయ ఉత్తమ చిత్రం: గంగపుత్రులు
తృతీయ ఉత్తమ చిత్రం: ప్రస్థానం
ఉత్తమ నేపథ్య గాయకుడు-  ఎం.ఎం.కీరవాణి..
ఉత్తమ నేపథ్య గాయని: ప్రణవి (సరిగమపదని-స్నేహగీతం)
ప్రత్యేక జ్యూరీ అవార్డులు: సమంతా (ఏమాయ చేశావే), చంద్ర సిద్దార్థ (అందరి బంధువయా), శ్రీరాములు (వేదం), మంచు మనోజ్‌కుమార్ (బిందాస్), సునీల్ (మర్యాద రామన్న)
పిల్లల ఉత్తమ చిత్రాల విభాగంలో ద్వితీయ, తృతీయ ఉత్తమ చిత్రాలుగా ఏవీ ఎంపిక కాలేదు.










No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...