Friday, August 5, 2011

మేడం కు యు.ఎస్. లో రహస్య వైద్యం...!

న్యూఢిల్లీ,అగస్ట్ 5: : ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి అమెరికాలో గురువారం శస్త్రచికిత్స జరిగింది. అయితే అది ఎందుకన్నది మాత్రం తెలియరాలేదు. సర్వైకల్ క్యాన్సర్ అంటూ పలు చానళ్లలో వార్తలు వచ్చినా, అవేవీ నిర్ధారణ కాలేదు. సోనియా ఆరోగ్యం, ఆమె అమెరికా పర్యటన వివరాలన్నింటినీ కాంగ్రెస్ వర్గాలు మొదటి నుంచీ అతి గోప్యంగా ఉంచడంతో, శస్త్రచికిత్స వార్త తెలియగానే దేశమంతా ఆశ్చర్యంలో మునిగిపోయింది. గురువారం సోనియా న్యూయార్క్ లోని మెమోరియల్ స్లోన్-కెటరింగ్ క్యాన్సర్ సెంటర్ (ఎంఎస్‌కేసీసీ) లో చేరారనిరాష్ట్రానికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఆంకాలజిస్టు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు  సారథ్యంలో, సోనియా కుటుంబ వైద్యుడు ఘాయ్ భండారీ సమక్షంలో శస్త్రచికిత్స జరిగిందని తెలియవచ్చింది.  కూతురు ప్రియాంక గాంధీ కూడా ప్రసుత్తం తల్లి వెంటే ఉన్నట్టు సమాచారం.
 రాహుల్‌ సారథ్యంలో ...
తన గైర్హాజరీలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను నడిపేందుకు రాహుల్ సారథ్యంలో నలుగురు నేతల గ్రూపును సోనియా ఏర్పాటు చేశారు. అయితే... పార్టీ దిగ్గజాలను కాదని... వివాదరహితుడుగా పేరున్న రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదీలను మిగతా సభ్యులుగా ఎంపిక చేయడం గమనార్హం. ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో పాటు... కాంగ్రెస్‌లో నంబర్ టూగా ఉన్న  ట్రబుల్ షూటర్ ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర హోం మంత్రి చిదంబరం వంటి ముఖ్య నేతలెవరికీ చోటు దక్కకపోవడంపై రాజకీయ వర్గాల్లో  చర్చ జరుగుతోంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...