Monday, August 1, 2011

ఒక రోజు ముందే ఓడిన భారత్...!

నాటింగ్‌హాం,అగస్ట్ 2:  రెండో  టెస్టులోను  ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వచ్చింది.
478 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 47.4 ఓవర్లలో 158 పరుగులకు ఆలౌటయింది. సచిన్ (86 బంతుల్లో 56; 8 ఫోర్లు), హర్భజన్ (44 బంతుల్లో 46; 8 ఫోర్లు, 1 సిక్సర్), ప్రవీణ్ (25 బంతుల్లో 25; 5 ఫోర్లు) మినహా ఒక్కరు కూడా కనీసం రెండంకెల స్కోరును చేరుకోలేదు. ముకుంద్ (3), ద్రవిడ్ (6), లక్ష్మణ్ (4), రైనా (1), యువరాజ్ (8), ధోని (0)... మొత్తం ఆరుగురూ ఘోరంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ సీమర్ బ్రెస్నన్ నిప్పులు చెరిగే బంతులతో భారత్‌ను కుప్పకూల్చాడు. బ్రెస్నన్ ఐదు వికెట్లు తీసుకోగా... అండర్సన్ మూడు, బ్రాడ్ రెండు వికెట్లు పడగొట్టారు.అంతకు ముందు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 120.2 ఓవర్లలో 544 పరుగులకు ఆలౌటయింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ బ్రెస్నన్ (118 బంతుల్లో 90; 17 ఫోర్లు)తో పాటు స్టువర్ట్ బ్రాడ్ (32 బంతుల్లో 44; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా పరుగులు చేశారు. ఇంగ్లండ్ 19.2 ఓవర్లలో 103 పరుగులు చేసి చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్ లోటును మినహాయిస్తే ఇంగ్లండ్‌కు 477 పరుగుల ఆధిక్యం లభించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన చూపించిన ఇంగ్లండ్ ఆటగాడు స్టువర్ట్ బ్రాడ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మూడో టెస్టు ఈ నెల 10 నుంచి బర్మింగ్‌హామ్‌లో జరుగుతుంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...