రామ్ చరణ్ నిర్మాతగా చిరంజీవి 150వ చిత్రం
తిరుపతి,అగస్ట్ 28: : శాసనసభ్యుడు చిరంజీవి తన 150వ చిత్రంపై మరోసారి స్పందించారు. తాను 150వ చిత్రంలో తన సోదరుడు, నిర్మాత నాగబాబు కోరిక మేరకే నటిస్తున్నానని చిరంజీవి ఆదివారం తిరుపతిలో చెప్పారు. తన 150వ చిత్రానికి తన తనయుడు రామ్ చరణ్ తేజ నిర్మాతగా వ్యవహరిస్తాడని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం జన్ లోక్‌పాల్ బిల్లుకు ఆమోదం తెలపడం హర్షణీయం అన్నారు. . గ్రామస్థాయిలో ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తల మధ్య కొంత గ్యాప్ ఉందని దానిని పూడ్చేందుకు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పా రు.

Comments