Monday, August 22, 2011

కాంగ్రెస్ కు జగన్ వర్గం గుడ్ బై

హైదరాబాద్,అగస్ట్ 22: : వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యులు సోమవారం  తమ పదవులకు రాజీనామా చేశారు. సభాపతి, ఉపసభాపతి అందుబాటులో లేనందున స్పీకర్ ఫార్మాట్‌లో తమ రాజీనామాలను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. మొత్తం 26 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. కొండా సురేఖ, కుంజా సత్యవతి, జయసుధ గతంలోనే తెలంగాణ కోసం రాజీనామాలు చేసిన నేపథ్యంలో వారు మళ్లీ రాజీనామాలు సమర్పించలేదు. రాజీనామాలు సమర్పించిన అనంతరం వారు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.అసెంబ్లీలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించిన నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు నేను ఎందుకు రాజీనామా చేస్తున్నానను అంటూ ఓ కరపత్రాన్ని పంపిణీ చేశారు. రాజీనామాల అనంతరం మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోసు కరపత్రంలోని అంశాలను చదివి వినిపించారు. పార్టీ నిర్జీవంగా ఉన్న సమయంలో పాదయాత్ర చేసి రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెసును అధికారంలోకి తీసుకు వచ్చిన రాజశేఅఖరెడ్డి   ఆశయాలను ఇప్పటి ప్రభుత్వం తుడిచి వేస్తూ ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తోందన్నారు. ప్రజల గుండెల్లో నుండి వైయస్‌ను తుడిచి వేసే ప్రయత్నాలు చేస్తోందన్నారు. వైయస్‌ను అవినీతిపరుడిగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తోందన్నారు.  వైయస్సాఆర్, జగన్‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న కాంగ్రెసులో కొనసాగలేమని అన్నారు. పార్టీకి కూడా రాజీనామాలు చేస్తున్నామని అన్నారు. స్పీకరు రాజీనామాలను ఆమోదించాలని లేదంటే కాంగ్రెసుకు అంతకంటే దౌర్భాగ్యం లేదన్నారు.  కాగా కాంగ్రెసు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వారు గాంధీ భవన్‌కు ఫ్యాక్స్ పంపారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...