Tuesday, August 16, 2011

సుప్రీం కోర్టుకు జగన్...

హైదరాబాద్,అగస్ట్ 16: తన ఆస్తులపై రాష్ట్ర  హైకోర్టు పూర్తిస్థాయి సిబిఐ విచారణకు ఆదేశించడంపై వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తనపై సిబిఐ విచారణను నిలుపుదల చేయాలని ఆయన సుప్రీం కోర్టును కోరారు. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సుప్రీం కోర్టులో తుది విచారణ పూర్తయ్యే వరకు తన కంపెనీలు, ఆస్తులపై జరుగుతున్న దర్యాఫ్తును ఆపాలని ఆయన సుప్రీం కోర్టుకు విన్నవించారు. కాగా ఇటీవల సిబిఐ అధికారులు ప్రాథమిక నివేదిక సమర్పించిన అనంతరం హైకోర్టు జగన్ ఆస్తులపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ఆదేశించిన విషయం తెలిసిందే. జగన్ కంపెనీలపై క్రిమినల్ కేసులు పెట్టి జగన్ కంపెనీలలోకి నిధులు ఎలా వచ్చాయో పూర్తిస్థాయి విచారణ జరగాల్సిందని తీర్పు చెప్పింది. ఎమ్మార్ లోనూ అక్రమాలు జరిగాయని హైకోర్టు అభిప్రాయపడింది. ఎమ్మార్ పైనా క్రిమినల్ కేసు పెట్టి పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...