Monday, August 15, 2011

షమ్మీ కపూర్ ఇకలేరు...

ముంబై,అగస్ట్ 15: బాలీవుడ్‌ను దశాబ్దాలపాటు ఏలిన పృథ్వీరాజ్ కపూర్ వంశాంకురం... రాజ్‌కపూర్, శశికపూర్‌ల సోదరుడు...విలక్షణ నటుడు షమ్మీ కపూర్ (79) ఇకలేరు. 1950, 60 దశకాల్లో రొమాంటిక్ హీరోగా, ప్లేబాయ్‌గా నాటి తరం ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన షమ్మీ కపూర్ ఆదివారం తెల్లవారుజామున ముంబైలో కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆయన ముంబైలోని బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1931, అక్టోబర్ 21న పృథ్వీరాజ్ కపూర్, రామ్‌సార్నీ దంపతులకు జన్మించిన షమ్మీ కపూర్  అసలు పేరు షంషేర్ రాజ్‌కపూర్. 1948లో జూనియర్ ఆర్టిస్ట్ గా బాలీవుడ్ లో ప్రవేశించిన షమ్మీ తొలి చిత్రం జీవన్‌జ్యోతి 1953లో  విడుదలైంది. 1961లో విడుదలైన జంగ్లీ చిత్రంతో స్టార్ ఇమేజ్ ఏర్పరుచుకున్నారు.  తుమ్సే నహీ దేఖా, దిల్ దేకే దేఖో, తీస్రీమంజిల్ తదితర చిత్రాల్లో నటించారు.  1968లో బ్రహ్మచారి చిత్రానికి గాను ఫిలిం ఫేర్ బెస్ట్ యాక్టర్‌గా, 1982లో విధాత చిత్రానికి గాను ఫిలిం ఫేర్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌ అవార్డులు అందుకున్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...