Wednesday, August 17, 2011

అమెరికా చదువులపై తగ్గని మోజు...

వాషింగ్టన్,అగస్ట్ 18:  అమెరికా చదువులపై భారతీయ విద్యార్థులకు మక్కువ ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ స్థాయిలో చదువు కోసం అమెరికా వచ్చేందుకు ఇండియా విద్యార్థులు  ఆసక్తి చూపుతున్నట్టు  తాజాగా వెలువడిన గణంకాలు  స్పష్టం చేస్తున్నాయి. గ్రాడ్యుయేట్ స్థాయిలో అడ్మిషన్ల కోసం ఈ ఏడాది పేర్లు నమోదు చేస్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 8 శాతం పెరిగింది. 2006 తర్వాత ఇదే అత్యధిక శాతమని కౌన్సిల్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ స్కూల్స్ (సీజీఎస్) తాజా సర్వే నివేదికలో పేర్కొంది. గతేడాది కేవలం 3 శాతం మెరుగుదల మాత్రమే కన్పించింది.2010-11 సంవత్సరానికి అడ్మిషన్ల కోసం నమోదు చేసుకున్న విదేశీ విద్యార్థుల సంఖ్యలో 11 శాతం పెరుగుదల నమోదయింది. 23 శాతం వృద్ధితో చైనా అగ్రస్థానంలో నిలిచింది. వరుసగా ఆరో ఏడాది చైనా రెండంకెల వృద్ధి సాధించిందని సీజీఎస్ వెల్లడించింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...