సకల జనుల సమ్మెమరోసారి వాయిదా?

హైదరాబాద్ ,అగస్ట్  31:  తెలంగాణ ప్రాంతంలో సకల జనుల సమ్మె మరోసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమ్మె వాయిదా పడినప్పటికి వరుసగా ఉద్యమ కార్యాచరణ రూపొందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత నెల 17వ తారీఖు నుండే సకల జనుల సమ్మె ప్రారంభించాలనుకున్నప్పటికీ రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరుల అభ్యర్థన మేరకు సమ్మెను విడతల వారీగా విభజిస్తూ సెప్టెంబర్ 6వ తేది నుండి ఉద్యోగులు సమ్మె ఉంటుందని చెప్పారు. అయితే ఇప్పుడు వినాయక చవితి రావడంతో మరోసారి జెఏసికి సమ్మె వాయిదా కోసం పలువురు విజ్ఞప్తి చేశారు. దీంతో మరోసారి వాయిదా పడే అవకాశం ఉంది. అయితే ఉద్యోగుల సమ్మె వాయిదా పడినప్పటికీ వరుస కార్యక్రమాల రూపకల్పనకు జెఏసి పథక రచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 6వ తారీఖుకు బదులు ఉద్యోగులు 13 నుండి సమ్మెకు దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈలోగా 8, 9, 10వ తేదీల్లో దశల వారిగా ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తారు. మరో రెండు మూడు రోజుల్లో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు