ది బాడీగార్డ్స్...
సల్మాన్ ఖాన్-కరీనాకపూర్ జంటగా హిందీలో రీమేకైన మలయాళ చిత్రం ‘బాడీగార్డ్’ బుధవారం నాడు విడుదలైంది. ఎన్నడూ లేనంతగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఏకంగా 120 థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేయడం ఓ విశేషం. ఒక్క హైదరాబాద్‌లోనే సల్లూభాయ్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను దృష్టిలో ఉంచుకుని 52 థియేటర్లలో రిలీజ్ చేశారు. ఇక తెలుగు రీమేక్ ‘గంగ ది బాడీగార్డ్’ చిత్రంలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్నారు. త్రిష వెంకీ సరసన రొమాన్స్ చేయనుంది. సల్మాన్ బాడీగార్డు చిత్ర ప్రభావం వెంకీ చిత్రంపై పడే అవకాశాలున్నాయని వ్యాపారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకే కథ, కథనంతో రూపొందిన చిత్రం కావడం తో ప్రేక్షకులకు ఒకే సినిమా చూశామన్న ఫీలింగ్ ఉంటుందేమోననేది క్రిటిక్స్ అభిప్రాయం. ఈ నేపథ్యంలో చాలా కాలంగా ఆశించిన స్థాయి హిట్లు లేక సతమతం అవుతున్న వెంకటేష్ కు సల్మాన్ రూపంలో భయం వెంటాడుతోంది. కొంపతీసి సల్మాన్ ఖాన్ ఏపీలో కలెక్షన్లు కొల్లగొడితే వెంకీకి ఏమీ మిగలవు అనే వాదన వినిపిస్తోంది.

Comments