ప్చ్..ఏం లాభం...?
దక్షిణాదిలో అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న అనుష్క ఇప్పుడు తెగ బాధ పడిపోతోంది. సహజనటి జయసుధలా బాలీవుడ్‌కు వెళ్లనని శపఢం పట్టిన అనుష్క ఆ మధ్య బాలీవుడ్ నుంచి వచ్చిన ఆఫర్లను వద్దు పొమ్మంది. తమిళంలో విజయవంతమైన ‘సింగం’ చిత్రాన్ని హిందీలో నిర్మించే సమయంలో హీరోయిన్‌గా ముందు అనుష్కకే ఆఫర్ వచ్చింది. అయినా సరే తన నిర్ణయంలో మార్పు లేదని కొట్టిపారేసింది. చివరికి ఏమైంది. సదరు చిత్ర నిర్మాతలు కాజల్‌ని తీసుకున్నారు. ఇప్పుడు తమిళ ‘సింగం’ హిందీలో ‘సింఘం’గా విడుదలై కాసుల వర్షం కురిపిస్తోంది. దానికి తోడు కాజల్‌కు బాలీవుడ్ లో పాపులారిటీ ఊడా పెరిగింది. ఇంకా ఆఫర్లు కూడా వచ్చి పడుతున్నాయిట. ఇదంతా చూస్తున్న అనుష్కకు బాధ గాక మరేమిటి చెప్పండి. అనవసరంగా ఆ చిత్రాన్ని వదులుకున్నాను. అదే చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినట్టయితే చాలా బాగుండేదని ఇప్పుడు తెగ పశ్శాత్తాప పడిపోతోంది. ప్చ్..ఏం లాభం...?

Comments