Saturday, December 19, 2015

నటుడు రంగనాథ్ ఇకలేరు...డిప్రెషన్ తో ఆత్మహత్య !

హైదరాబాద్,డిసెంబర్ 19; ప్రముఖ సినీ నటుడు రంగనాథ్‌ శనివారం సాయంత్రం మృతిచెందారు. హైదరాబాదు కవాడిగూడలో ఉన్న తన నివాసంలో ఆయన కన్నుమూశారు. సూమారు 300కు పైగా చిత్రాల్లోనటించిన ఆయన, పలు చిత్రాల్లో కథానాయకుడిగా నటించారు.  50కు పైగా చిత్రాల్లో ప్రతినాయకుడిగా పాత్ర పోషించారు. మొగుడ్స్-పెళ్లామ్స్ చిత్రానికి దర్శకత్వం వహించారు. పలు సీరియళ్ళలో కూడా ఆయన నటించారు.చెన్నై నగరంలో 1949లో జన్మించిన రంగనాథ్‌. 1969లో బుద్ధిమంతుడు సినిమాతో తొలిసారి వెండితెరపై కనిపించారు. చందన (1974) చిత్రంలో హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చారు.  టీసీగా పనిచేస్తూ సినీరంగలోకి ప్రవేశించిన రంగనాథ్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. చాలాకాలం కిందటే ఆయన భార్య ప్రమాదవశాత్తు గాయపడి మంచానికి పరిమితం కాగా, ఎన్నో ఏళ్ళపాటు ఆమెను చనిపోయేవరకు చంటిబిడ్డలా చూసుకున్నారు. ఆమె మరణం తర్వాత రంగనాథ్ ఎంతో కుంగిపోయినప్పటికీ అత్యంత మనోనిబ్బరంతో ఆ వేదన నుంచి బయటపడి కవితా రచనలో నిమగ్నమయ్యారు.  కాగా రంగనాథ్ ఒంటరితనం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు చెబుతున్నారు. అనుమానం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...