Wednesday, November 3, 2010

పొంచివున్న మరో తుపాను ముప్పు...

 హైదరాబాద్,నవంబర్ 3:  భారీ వర్షాలకు కోస్తా ఆంధ్ర లో పంటలకు భారీ నష్టం సంభవించింది. వరి తోపాటు ఇతర పంటలు, అరటి పంటలు దెబ్బతిన్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. రోడ్లు   దెబ్బతిన్నాయి.  పలుచోట్ల చెరువులకు గండ్లు పడ్డాయి. వేల సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి. అనేక వేల ఇళ్లు నీట మునిగాయి. దాదాపు 25 మంది మృతి చెందారు.ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో రైలు మార్గాలు దెబ్బతిన్నాయి. విశాఖపట్నం జిల్లాలో 30 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.విశాఖ జిల్లా యలమంచిలిలో కొండ చరియలు విరిగిపడి పది ఇళ్లు ధ్వంసం అయ్యాయి. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. శ్రీకాకుళంలో 72 ఇళ్లు కూలిపోయాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 350 కోట్ల రూపాయల విలువైన పంటకు నష్టం జరిగిందని అంచానా. కృష్ణా జిల్లా మచిలీపట్నం, న్యూజివీడు, గుడివాడ ప్రాంతంలో భారీ నష్టం సంభవించింది. తెనాలి ప్రాంతంలో అరటి పంటకు నష్టం జరిగింది.  నెల్లూరు జిల్లాలో సోమశిల రిజర్వాయర్'కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కాగా,ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల కోస్తా, రాయలసీమ జిల్లాలలో వచ్చే 48 గంటలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు దక్షిణ అండమాన్ తీరంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి మరింత బలపడే అవకాశం ఉందని ,చెప్పారు. అది వాయుగుండంగా మారితే వచ్చే 48 గంటలలో రాష్ట్రానికి తుఫాను ప్రమాదం ఉంటుదని హెచ్చరించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...