Wednesday, November 3, 2010

దక్షిణ కరోలినా గవర్నర్‌గా ఇండియన్ అమెరికన్ మహిళ నిక్కీ హాలే

వాషింగ్టన్,నవంబర్ 3: అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఇండియన్ అమెరికన్ మహిళ నిక్కీ హాలే(39)  దక్షిణ కరోలినాకు తొలి మహిళా గవర్నర్‌గా ఎన్నిక యి  సరికొత్త అధ్యాయాన్ని నెలకొల్పారు. హోరాహోరీగా జరిగిన ఎన్నికల లో 52 శాతం ఓట్లతో విజయాన్ని అందుకున్నారు.రిపబ్లిన్ పార్టీ తరపున ఆమె పోటీ చేశారు. నిక్కీ హాలే ప్రత్యర్థి, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి విన్సెంట్ షీహాన్‌కు 46 శాతం ఓట్లు దక్కాయి. అమెరికాలో గవర్నర్ పదవి చేపట్టిన రెండో ఇండియన్ అమెరికన్‌గా ఆమె ఖ్యాతి కెక్కారు. లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ ఆమె కంటే ముందు ఈ ఘనత సాధించారు. అంతేకాకుండా అగ్రరాజ్యంలో గవర్నర్ గద్దెనెక్కిన తొలి భారత సంతతి మహిళగా కూడా  ఆమె చరిత్ర సృష్టించారు. నిక్కీ హాలే తల్లిదండ్రులు పంజాబ్ నుంచి వలసవచ్చి అమెరికాలో స్థిరపడ్డారు. బాబీ జిందాల్ తల్లిదండ్రులు కూడా పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారే కావడం విశేషం.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...