Monday, November 1, 2010

నిరసనలు,అరెస్టుల మధ్య రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలు

హైదరాబాద్,నవంబర్ 1: తెలంగాణావాదుల నిరసనలు,సీమాంధ్రుల వుత్సవాలతో రాష్ట్రావతరణ దినోత్సవం సోమవారం ప్రశాంతంగా ముగిసింద్. తెలంగాణ జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలపై తెలంగాణవాదులు నల్లజెండాలు ఎగురువేశారు. తెలంగాణ విద్రోహ దినంగా పాటించాలంటూ తెలంగాణవాదులు డిమాండ్ చేశారు. అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రులను అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో కొద్దిచోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నల్గొండ జిల్లాలో తెలంగాణవాదులు రాస్తారోకో చేపట్టారు. కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద 9వ నెంబర్ జాతీయ రహదారిపై బైఠాయించి తమ నిరసనలు తెలిపారు. దీంతో సుమారు అయిదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. రంగారెడ్డి జిల్లా అబ్దులాపూర్‌మెట్ వద్ద విజయవాడ హైవేపై తెలంగాణవాదులు నిరసనకు దిగారు. ఆందోళనకారులు రోడ్లపై టైర్లకు నిప్పుపెట్టారు. ఈ ఆందోళనలో పాల్గొన్న తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్‌తో సహా ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొనవద్దంటూ మంత్రి గీతారెడ్డికి నివాసాన్ని టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు ముట్టడించారు. వీరు సికింద్రాబాద్‌లోని ఆమె నివాసం వద్ద బైఠాయించి నిరసనలు తెలిపారు. గీతారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో టీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు సహా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.తార్నాకలో మర్రి శశిథర్‌రెడ్డి నివాసంపై విద్యార్థులు దాడి చేశారు. ఆందోళనకారులు ఇంట్లోకి చొచ్చుకువెళ్లి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. అనంతరం ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. జై తెలంగాణ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాగా, సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాసనసభ నుంచి తెలుగుతల్లి విగ్రహం వరకూ ర్యాలీ నిర్వహించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...