Tuesday, November 2, 2010

తగ్గనున్న వర్షాలు...

హైదరాబాద్,నవంబర్ 2:మంగళవారం కూడా కోస్తాంధ్రలో కుంభవృష్టి కురిసింది. అనేక జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లక్షలాది ఎకరాల్లో పంట నీటమునిగింది. వరి, పత్తి, మినుము, మిరప, కంది పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే వరి నష్టం రూ. 350 కోట్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.మరోవైపు అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనాలు కాస్త బలహీనపడ్డాయి. దీంతో వర్షాలు ఒకట్రెండు రోజుల్లో కాస్త తగ్గుముఖం పట్టనున్నాయి. రానున్న 48 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురవవచ్చని భారత వాతావరణ విభాగం  తెలిపింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...