Tuesday, November 2, 2010

ఒబామా వెంట భారీ మందీమార్బలం...

న్యూఢిల్లీ,నవంబర్ 2: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటనకోసం అమెరికా స్వయంగా తన సొంత భారీ భద్రతా ఏర్పాట్లతో సిద్ధమైంది. అమెరికా నిఘా, భద్రతా సంస్థలు హెలికాప్టర్లతోసహా వారం క్రితం నుండే ముంబైలో మకాం వేశాయి. తీరంలో ఒక నౌక ప్రపంచంలోనే అత్యంత ఆధునిక నిఘా సాధనాలతో గస్తీ కాస్తోంది. ఒబామా 3,000 మందీమార్బలంతో తరలి రానున్నారు. వారందరికీ విస్తృతమైన భద్రత, వసతి వగైరాలకు అమెరికా రోజుకు రూ. 900 కోట్లు ఖర్చు చేయనుంది. మహారాష్ట్ర పోలీసులకు తోడుగా భారత నావికా వాయుదళాలు ముంబై తీర ప్రాంతాన్ని నిరంతరం గస్తీ కాస్తున్నాయి.ఒబామా రాకకు అరగంట ముందునుంచే ముంబై గగనతలాన్ని మూసివేస్తారు. ఎస్‌ఆర్‌పీఎఫ్, ఫోర్స్ ఒన్, ఎన్‌ఎస్‌జీ బలగాలు సిద్ధంగా ఉన్నాయి. ఒబామా దంపతులు బసచేసే హోటల్ తాజ్‌తోపాటు, గేట్ వే ఆఫ్ ఇండియా మొదలుకుని గాంధీ మ్యూజియం ఉన్న మణిభవన్ వరకు వారు సందర్శించే అన్ని స్థలాలను పదేపదే తనిఖీలు చేస్తున్నారు.  

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...