Thursday, November 11, 2010

రాజా చుట్టూ రాజకీయం...

న్యూఢిల్లీ,నవంబర్ 11: 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న   కేంద్ర టెలికాం మంత్రి ఎ. రాజాను బర్తరఫ్‌ చేయాలన్న డిమాండ్‌ తో  గురువారం  కూడా పార్లమెంట్‌ ఉభయసభలు స్తంభించాయి. రాజాను తొలగించాల్సిందేనని బీజేపీ సహా అన్ని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. 2 జి స్పెక్ట్రమ్‌ వ్యవహారంలో రాజా పాత్రను కాగ్‌ తప్పు పట్టినప్పటికీ యూపీఏ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటని విమర్శించాయి. కాగా,  రాజాను బర్తరఫ్‌ చేయాల్సిందేనని చెన్నై లో ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత స్పష్టం చేశారు. రాజాపై వేటు వేస్తే 18 మంది ఎంపీలున్న డీఎంకే.. యూపీఏకు మద్దతు ఉపసంహరించినా ఆ సంఖ్యను తాము  భర్తీ చేయగలమని, తమ పార్టీకి తొమ్మిది మంది ఎంపీలున్నారని,  మిత్ర పక్షాల నుంచి మరో తొమ్మిది మంది ఎంపీల మద్దతు కూడా కూడగడతామని జయ భరోసా ఇచారు.  మరోవైపు రాజా వ్యవహారంపై డీఎంకేలో అంతర్మథనం ప్రారంభమైంది. యూపీఏ ప్రభుత్వానికి మద్దతిచ్చేం దుకు సిద్ధంగా ఉన్నట్లు ఏఐడీఎంకే అధినేత్రి జయలలిత ప్రకటించడం కూడా వారి ఆందోళనకు  కారణమవుతోంది. డీఎంకే అధినేత కరుణానిధి కాగ్ నివేదికను తెప్పించుకుని అధ్యయనం చేసినట్లు సమాచారం. దీనిపై ఆయన పార్టీలోని కోర్ గ్రూప్‌తో, కాంగ్రెస్ పార్టీ వర్గాలతో చర్చలు జరిపినట్లు తెలిసింది. వెంటనే చర్యలు తీసుకోవడం కన్నా కొంత కాలం వేచి చూద్దామనే ధోరణిలో డీఎంకే ఉన్నట్లు సమాచారం. దీనికి కాంగ్రెస్ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది.  డీఎంకే అధినేత కరుణానిధి కుమార్తె, పార్టీ నాయకురాలు కనిమొళి గురువారం ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. రాజాను తొలగించకూడదంటూ ఆమె ముఖర్జీకి సూచించినట్లు  తెలిసింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...