Thursday, November 11, 2010

కేశవరావు తో కేసీఆర్ మంతనాలు

న్యూఢిల్లీ,నవంబర్ 11:  కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఇచ్చి    చాలాకాలమైందని, ఇక అమలు ప్రక్రియే మిగిలిందని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కొత్త రాగం అందుకున్నారు.   అందుకోసం కాంగ్రెస్‌ను పటిష్టం చేసే బాధ్యత తనపై ఉందని కూడా అన్ అన్నారు.  ‘ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చేది కాంగ్రెసే. కాబట్టి ఆ పార్టీని పటిష్టపరిచే పనిలో నిమగ్నమయ్యాం’ అని కూడా చెప్పరు.  కాంగ్రెస్‌కు, తమకు బాబు మాత్రమే ఉమ్మడి రాజకీయ శత్రువని తేల్చిచెప్పారు.  గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు నివాసంలో దాదాపు రెండున్నర గంటలపాటు కేసీఆర్ మంతనాలు సాగించారు. అంతకుముందు పార్లమెంటు సెంట్రల్ హాల్లోనూ నేతలిద్దరూ గంట పాటు మాట్లాడుకున్నారు. అనంతరం కేకే ఇంట్లో వారు విలేకరులతో మాట్లాడారు. ‘‘మేమేం ముందుగా అనుకుని భేటీ కాలేదు. కేకే కూడా తెలంగాణవాది. శ్రీకష్ణ కమిటీ నివేదిక రానున్నందున, డిసెంబర్ 31 ముందు, తర్వాత ఏమిటనే విషయాలపై మాట్లాడుకున్నాం’’ అని కేసీఆర్ చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ ఏ సిఫార్సు చేసినా అంగీకరిస్తారా అని కేసీఆర్‌ను ప్రశ్నించగా, దానిపై నిర్ణయాధికారం కేంద్రానిదేనని గుర్తు చేశారు. నివేదిక అనంతరం జనవరి చివరి వారం దాకా సంయమనం పాటిస్తామని చెప్పారు. ఆ తర్వాత, ప్రజల్లో అపోహలు వస్తాయి కాబట్టి స్పందించి తీరతామన్నారు. అప్పటికీ కేంద్రం స్పందించకపోతే తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్ అనే వార్త సృష్టించిన వారికి  బుద్ధి లేదన్నారు. మహారాష్ట్ర నుంచి గుజరాత్ విడిపోయినపుడు ముంబైని కేంద్రపాలిత ప్రాంతం చేశారా అని ప్రశ్నించారు. సోనియా అనుమతితోనే డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన వచ్చిందని,  ఆ ప్రక్రియ ఆరంభం కాకపోతే డిసెంబర్ 31 తర్వాత  తీవ్రంగా ఉద్యమిస్తామని అన్నారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...