Thursday, November 11, 2010

ఆస్ట్రేలియా వీసా రూల్స్ క్లిష్టతరం

మెల్‌బోర్న్,నవంబర్ 11 : ఆస్ట్రేలియా కొత్త వలస విధానాన్ని ప్రకటించింది. ఇప్పటివరకు ఒక మోస్తరు వృత్తినైపుణ్యం, అనుభవం ఆధారంగా ఇమ్మిగ్రేషన్ సదుపాయాన్ని కల్పించగా తాజాగా పాయింట్ల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో ఇంగ్లిష్ భాషలో అత్యంత ప్రావీణ్యం, ఉన్నత విద్యార్హతలు గల వారికి ప్రాధాన్యం ఉంటుంది. తక్కువస్థాయిలో నైపుణ్యం ఉండి ఆస్ట్రేలియాకు రావాలనుకునే భారత విద్యార్థుల అవకాశాలకు కొత్త విధానం వల్ల విఘాతం కలిగే అవకాశం వుంది. ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం, అనుభవం, ఉన్నత విద్యార్హతల ఆధారంగా కొత్త పరీక్షావిధానం ఉంటుందని ఇమ్మిగ్రేషన్ శాఖ మంత్రి క్రిస్ బ్రౌన్ అన్నారు. నైపుణ్యంగల వ్యక్తులకే ఇమ్మిగ్రేషన్ సదుపాయం కల్పించే చర్యల్లో భాగంగా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినట్టు ఆయన తెలిపారు. ఇమ్మిగ్రేషన్ విధానంలో సంస్కరణలు తీసుకురావాలని ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన చెప్పారు. తక్కువస్థాయి నైపుణ్యం, అర్హతలుగల విదేశీ విద్యార్థులు ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోకుండా అడ్డుకోవడమే కొత్త విధానం లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. నైపుణ్యంగల విద్యార్థులు, ఉద్యోగులకు కొత్త విధానం అనుకూలంగా ఉందని ఆయన తెలిపారు. కాగా, దీనికి సంబంధించిన చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంటుంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...