Monday, November 1, 2010

రాష్ట్రాన్నివదలని ముసురు


హైదరాబాద్,నవంబర్ 1:  అల్పపీడన ద్రోణి ప్రభావంతో గత రెండు రోజులుగా రాష్ట్రాన్ని ముసురు కమ్ముకుంది.  ముఖ్యంగా కోస్తా, తెలంగాణ ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై  మబ్బులు కమ్మేయడంతో పగలు, రాత్రి తేడా తగ్గిపోయింది. వాతావరణం చల్లబడింది. చలిగాలులతో రోడ్లపై జనసంచారం పలచబడింది. మరోవైపు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కోస్తా తడిసిముద్దమయింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అకాల వర్షాలతో  వేలాది ఎకరాల్లో పంట దెబ్బ తింది.  దీపావళి పండుగ మరో నాలుగు రోజుల్లో ఉండండంతో ఈ ముసురు  ప్రజలను నిరుత్సాహ పరుస్తోంది, వాతావరణం ఇలాగే కొనసాగితే  తమ వ్యాపారం దెబ్బతింటుందని బాణా సంచా వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.  కాగా, బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. కోసాంధ్రపై ఈశాన్య రుతుపవనాలు, ఉపరితల ఆవర్తనాలు చురుకుగా కదలాడుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.  తీరం వెంబడి ఈశాన్యం దిశగా గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...