Monday, November 1, 2010

ఒకప్పటి గెరిల్లా-నేడు బ్రెజిల్ అధినేత

Dilma Rousseff was once one of most Brazil's most wanted fugitives, branded by some as a "subversive Joan of Arc."

సావోపాలో,నవంబర్ 1: బ్రెజిల్ అధ్యక్ష పదవికి ఒక మహిళ మొట్టమొదటిసారిగా ఎన్నికయ్యారు. ఆమె, ఒకప్పుడు భద్రతా బలగాలు వెంటాడి వేటాడిన ప్రముఖ గెరిల్లా దిల్మా వానా రోసెఫ్ (62) కావడం విశేషం. గత నెల 24న జరిగిన రెండో దఫా అధ్యక్ష ఎన్నికలలో అధికార వర్కర్స్‌పార్టీ (పీటీ) అభ్యర్థి రోసెఫ్ గెలుపొందినట్టుగా సుప్రీం ఎలక్టోరల్ కోర్టు ప్రకటించింది. సెంట్రిస్ట్ పీఎస్‌డీబీ అభ్యర్థి జోస్ సెర్రాకు, రోసెఫ్‌కు మధ్య జరిగిన ముఖాముఖి పోరులో రోసెఫ్‌కు 55.6 శాతం ఓట్లురాగా, సెర్రాకు 44.4 శాతం ఓట్లు లభించాయి. అక్టోబర్ 3 నాటి మొదటిదఫా ఎన్నికల్లో త్రిముఖ పోటీలో అత్యధిక శాతం ఓట్లు సాధించినా, 50 శాతం కంటే కనీసం ఒక్క ఓటైనా ఎక్కువ సాధించడంలో విఫలమయ్యారు. దీంతో రెండో రౌండ్ తప్పలేదు. సుప్రసిద్ధుడైన దేశాధినేతగా వెలుగొందుతున్న లూయిజ్ ఇనాషియో లూలా డ సిల్వా (లూలా) స్వయంగా రోసెఫ్‌ను తన అభ్యర్థిగా ప్రకటించి ప్రచారం చేశారు. రోసెఫ్ జనవరి 1న దేశాధ్యక్ష బాధ్యతలను స్వీకరిస్తారు. లూలా తొలి పదవీకాలంలో విద్యుచ్ఛక్తి మంత్రిగా పనిచేసిన రోసెఫ్, 2005 నుండి చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా కీలక బాధ్యతలు నిర్వహించారు. రోసెఫ్ హైస్కూల్‌లో చేరే నాటికి బ్రెజిల్ సైనిక నియంతృత్వం (1964 నుంచి 1974) కింద మగ్గుతోంది. సోషలిజం, విప్లవ భావాలు, విద్రోహకర కార్యకలాపాలు ఆమెకు అక్కడే వంటబట్టాయి. కళాశాల రోజుల్లో ఓ రహస్య కమ్యూనిస్టు సంస్థలో చేరి, గెరిల్లాగా మారారు. ఆ సంస్థ ఆర్థిక, ఆయుధ సరఫరా విభాగాలను చాకచక్యంగా నిర్వహించారు. బ్యాంకు లూటీలు, కిడ్నాపులు, హత్యలు, కుట్రలలో ఆరితేరిందంటూ పోలీసులు ఎప్పుడూ నీడలా వెంటాడే వారు. 1970, 1972లలో పోలీసులకు పట్టుబడి చిత్రహింసలు అనుభవించారు. మూడేళ్లు జైలు జీవితం తరువాత మారిన పరిస్థితుల లో క్షమాభిక్ష పొందారు. అర్థశాస్త్రం, సామాజిక శాస్ర్తాలను అధ్యయనం చేశారు. 2009 మేలో 61 ఏళ్ల వయసులో క్యాన్సర్‌తో పోరాడి జయించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...