Monday, November 1, 2010

డిసెంబర్ 9 చిదంబరం ప్రకటన నేను చేయించిందే...టీ.వీ.చర్చా గోష్టిలో కే.సీ.ఆర్. సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్,నవంబర్ 1: డిసెంబర్‌ 9 నాటి ప్రకటన వెనుక తన ప్రమేయం ఉందని, కేంద్రహోంమంత్రి చిదంబరం తనతో సంప్రదిం చిన తర్వాతనే ప్రకటన చేశారని ఒక టీ.వీ చానల్ చర్చా గోష్టిలో కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.నిరాహార దీక్ష చేపట్టిన 10వ రోజున కేంద్రం తనతో కాంటాక్ట్ లోకి వచ్చిందని, తాను ప్రకటన రాసిస్తేనే సోనియాగాంధి పుట్టిన రోజు కానుకగా డిసెంబర్‌9 నాడు చిదంబరం ప్రకటన చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘54 యేళ్ల తర్వాత కేంద్రం దిగివచ్చి డిసెంబర్‌9న కేంద్ర హోం మంత్రి ప్రకటన చేశారు. తెలంగాణ ఇస్తామని ప్రకటిం చారు. ఈ ప్రకటనను చిదంబరం వ్యక్తిగత ప్రకటనగా టీడీపీ వారు ప్రచారం చేశారు. కానీ యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌ అనుమతితోనే ప్రకటన చేశారు. నేను దీక్షలో నింస్ ఆస్పత్రిలో ఉండగా ఢిల్లీ అధిష్టానం నాతో మాట్లాదింది. అఖిలపక్ష పార్టీల అభిప్రాయా లు తీసుకున్నాం. కేసీఆర్‌ దీక్ష విరమించుకో, మొండిగా వ్యవహరించవద్దు, నీకు ఎలాంటి ప్రకటన కావాలి? అంటే.. ప్రకటన రాసి ఇచ్చాను.ప్రకటన వల్ల కేంద్రం ఇరు కున పడే పరిస్థితి ఉండవచ్చు. పరిష్కారానికి కొంత సమయం కావాలని భావించి ఉండవచ్చు. అందుకనే కమిటీ వేశారు’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు. డిసెంబర్‌ 9 ప్రకటన తర్వాత దీక్ష విరమించాను. 2004లో సోనియా గాంధి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారమే డిసెంబర్‌ 9న తన పుట్టిన రోజు కానుకగా ఆమె ప్రకటన చేయించారని జైపాల్‌ రెడ్డి నాతో చెప్పారు. జనవరి 5న జైపాల్‌రెడ్డి నన్ను హత్తుకుని అభినందించారు. నీ దీక్షతో కేంద్రం దిగివచ్చిందని మెచ్చుకున్నారు.శ్రీకృష్ణ కమిటీకి మెడకాయమీద తలకాయ ఉంటే తెలం గాణ ఇవద్దని రిపోర్టు ఇస్తదా? మంచి మేధావులు, జడ్జి ఉన్నా డనే కమిటీకి రిపోర్టు ఇచ్చాం’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...