Wednesday, November 3, 2010

భారతీయ సంతతి అమెరికన్ శాస్తవ్రేత్త అమిత్ గోయల్ కు ప్రతిష్టాత్మక అవార్డు

బోస్టన్,నవంబర్ 3 : భారతీయ సంతతి అమెరికన్ శాస్తవ్రేత్త అమిత్ గోయల్ ప్రతిష్టాత్మక ఆర్ అండ్ డీ మ్యాగజైన్ ఇన్నొవేటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డుకు శాస్త్ర పరిశోధనల ఆస్కార్‌గా పేరుంది. ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థి అయిన అమిత్ గోయల్ అమెరికాలోని ఓక్‌రిడ్జ్ నేషనల్ ల్యాబొరేటరీలో శాస్తవ్రేత్తగా పనిచేస్తున్నారు. అతి ఉష్ణోగ్రత అతివాహక పదార్థాల రంగంలో దిట్టగా పేరు పొందారు. ఈ నెల 11న ఫ్లోరిడాలో అవార్డు ప్రదాన కార్యక్రమం జరగనుంది. గత మూడేళ్లలో గోయల్ ఈ అవార్డు అందుకోవడం ఇది మూడోసారి. దాదాపు 300 పరిశోధన పత్రాలు సమర్పించిన గోయల్ పేరుపై 54 పేటెంట్లు కూడా ఉన్నాయి.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...