Tuesday, November 2, 2010

నాంపల్లి కోర్టుకు రామలింగరాజు

హైదరాబాద్,నవంబర్ 2 : సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు, ఆ సంస్థ మాజీ ఛైర్మన్ రామలింగరాజు మంగళవారం నాంపల్లి కోర్టుకు హాజరు అయ్యారు. మొత్తం 338మందిని విచారించేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు రంగం సిద్ధం చేసింది.  రామలింగరాజుకు మంజురైన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. కాగా, సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో ఈ నెల8వ తేదీనుంచి రోజువారీ విచారణ జరుగుతుందని సీబీఐ డీఐజీ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి సుమారు వెయ్యి డాక్యుమెంట్లను కోర్టులో ప్రవేశపెట్టినట్లు తెలిపారు. వారానికి ఆరుగురు సాక్షులను విచారించేలా అనుమతి ఇవ్వాలని సీబీఐ కోరగా, అందుకు న్యాయస్థానం అంగీకరించింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...