Tuesday, November 2, 2010

బెర్లిన్‌లో 46వ పుట్టినరోజు జరుపుకున్న షారూఖ్

Bollywood actor Shah Rukh Khan poses during a photo call in Berlin, Germany, on Friday, Oct. 22, 2010. The actor, who turned 45 today, is working on his new action movie


ముంబై,నవంబర్ 2: బాలీవుడ్ సూపర్ స్టార్  షారూఖ్ ఖాన్ మంగళవారం  జర్మనీ రాజధాని బెర్లిన్‌లో కుటుంబ సభ్యులతో కలిసి 46వ  పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ‘డాన్-2’ సినిమా షూటింగ్ కోసం ఆయన అక్కడకు వెళ్లారు. తన పిల్లలు, హృతిక్‌రోషన్, సుశానే దంపతులు, ‘డాన్-2’ సినిమా యూనిట్‌తో కలిసి జన్మదిన వేడుకలు జరుపుకున్నట్టు షారూఖ్ ట్విట్టర్‌లో రాసుకున్నారు. అభిమానులు తనపై చూపుతున్న ఆదరాభిమానాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. షారూఖ్ ఖాన్ కు దర్శకుడు కరణ్ జోహార్, నటుడు అర్జున్ రాంపాల్, ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా, హీరోయిన్ బిపాసా బసు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.  షారూఖ్ ఖాన్ ఈ ఏడాది ఒకే చిత్రం 'మై నేం ఈజ్ ఖాన్ '  లో మాత్రమే నటించారు. ఈ సినిమా కు శివసేన నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...