Thursday, November 4, 2010

ఖరీఫ్‌లో వర్షాలవల్ల 5,776 కోట్లు నష్టం

హైదరాబాద్,నవంబర్ 4 : ఖరీఫ్‌లో భారీ వర్షాల కారణంగా రాష్ట్రానికి 5,776 కోట్ల వరకూ నష్టం వాటిల్లిందని ప్రభుత్వం కేంద్ర బృందానికి నివేదిక సమర్పించింది. తక్షణ సాయంగా రూ. 1,154 కోట్లను ఇవ్వాలని కోరింది. నష్టం వివరాలను అంచనా వేసేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఆర్‌ఆర్ ఝా నేతృత్వంలో కమిటీ రెండు బృందాలుగా విడిపోయి మూడు రోజులపాటు పర్యటించింది. గుంటూరు, పశ్చిమగోదావరి, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పర్యటనల అనంతరం బృందం సభ్యులు  ముఖ్యమంత్రి రోశయ్యను కలిశారు. ఈ సందర్భంగా నష్టం వివరాలపై ప్రభుత్వం వారికి ఓ నివేదిక సమర్పించింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కురిసిన భారీ వర్షాలతో 19 జిల్లాల్లో సాధారణం కంటే 30 శాతం అధిక వర్షపాతం నమోదైందని తెలిపింది. శాశ్వత మరమ్మతుల కోసం రూ. 422 కోట్లు కావాలని విజ్ఞప్తి చేసింది. భారీ వర్షాల కారణంగా 65 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. 2.71 లక్షల హెక్టార్లలో వ్యవసాయ పంటలకు, 4,732 హెక్టార్లలో ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లినట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రోశయ్య కేంద్ర బృందానికి వివరించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...