Sunday, November 7, 2010

విలక్షణ నటనకు 56 వసంతాలు...

Kamal Haasan.jpg
వెబ్‌సైటుhttp://www.universalherokamal.com
చెన్నై,నవంబర్ 7: విలక్షణ నటుడు, జాతీయ అవార్డు విజేత కమల్‌హాసన్ 56వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆరేళ్ల ప్రాయంలోనే సినిమాల్లో నటించడం మొదలుపెట్టిన కమల్ ఈ సృజనాత్మక రంగంలోకి వచ్చి 50 ఏళ్లు పూరైన సందర్భంగా గత ఏడాది వేడుకలు జరుపుకున్నారు. అద్భుతమైన చిత్రాలు, అద్వితీయమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన కమల్‌కు దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించారు. దక్షిణాదిలో తిరుగులేని కథనాయకుడిగా పేరుతెచ్చుకున్నారు. ఆయన చిత్రాలంటే ప్రేక్షకులు తప్పనిసరిగా కొత్తదనం, వినోదంతో పాటు సామాజిక కోణాన్ని వెతుకుతారు. చిత్రరంగానికి ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ కేంద్రప్రభుత్వం ప్రద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...