Sunday, November 7, 2010

అహ్మదాబాద్ టెస్ట్ లో భారత్ ఎదురీత

అహ్మదాబాద్,నవంబర్ 7: మొదటి టెస్టు నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఆరు వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో సూపర్ సెంచరీతో ఆకట్టుకున్న డాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ రన్నౌట్ అవ్వగా, వెనువెంటనే మరో ఓపెనర్ గౌతం గంభీర్ డకౌటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సీనియర్ బ్యాట్స్‌మెన్ రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండుల్కర్‌లు కూడా నిలువలేకపోయారు. ద్రవిడ్ ఒక్క పరుగు, సచిన్ 12 పరుగులు చేసి పెవిలియన్ తోవ పట్టారు. అద్భుతమైన ఫాంలో ఉన్న సురేష్‌రైనా డకౌట్ అయి జట్టు కష్టాలు రెట్టింపు చేశాడు. కెప్టెన్ ధోనీ 22 పరుగులు చేసి అవుటయ్యాడు. కివిస్ బౌలర్లు ఒక్క ఎక్స్ ట్రా పరుగు కూడా ఇవ్వకపోవడం గమనార్హం. కాగా న్యూజిల్యాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 459 పరుగులకు ఆలౌటయింది. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో 487 పరుగులు చేసిన భారత్ 28 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.విలియమ్‌సన్(103), రైడర్(131) సెంచరీలతో ఆకట్టుకోగా, టైలర్(56), మెక్కల్లమ్(65) అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. భారత బౌలర్లలో ఓజా నాలుగు వికెట్లు పడగొట్టగా, జహీర్‌ఖాన్, శ్రీశాంత్‌లు చేరో రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. హర్భజన్‌సింగ్, రైనాలకు తలో వికెట్ తీసుకున్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...