Sunday, November 7, 2010

చెన్నై సమీపంలో తీరం దాటిన 'జల్' తుఫాన్

చెన్నై,నవంబర్ 7:  జల్ తుఫాన్ బలహీనపడుతోంది. రాత్రి పది గంటల ప్రాంతంలో చెన్నై సమీపంలో తీరాన్ని దాటింది.  ప్రస్తుతం నెల్లూరు వద్ద సముద్రం తీరం అతలాకుతలం అయింది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. గాలులు భారీగా వీస్తున్నాయి. చెట్లు ఊగిపోతున్నాయి. తుఫాన్ పూర్తిగా  తీరం దాటేవరకు పరిస్థితి ఇదేవిధంగా ఉంటుదని సమాచారం. జల్ ధాటికి భారీవర్షాలు నెల్లూరు జిల్లాను ముంచెత్తాయి. ప్రకాశం జిల్లాతోపాటు చెన్నై, తిరువళ్లూరులోనూ భారీవర్షాలు పడ్డాయి. ఉత్తర కోస్తాలో కూడా ఆదివారం సాయంత్రానికి మళ్లీ వర్షాలు కురిశాయి. తీరం దాటిన తర్వాత కూడా జల్ ప్రభావం 24 గంటలపాటు దాని ప్రభావం ఉంటుందని వాతావరణ విభాగం వెల్లడించింది. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తరకోస్తాలో పలుచోట్ల మోస్తరు నుంచి కొద్దిపాటి వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు చేపలవేటకు వెళ్లరాదని విశాఖలోని తుపాను హెచ్చరిక కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. జల్ తుపాను కారణంగా రాష్ట్రంలో శనివారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకు వేర్వేరు సంఘటనల్లో ముగ్గురు చిన్నారులు సహా 22 మంది మృతిచెందారు.




No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...