Monday, February 1, 2016

కాపుల ఆవేశం మీద నీళ్ళు చల్లిన పవన్ !

హైదరాబాద్: తుని కాపుగర్జనలో జరిగిన విధ్వంసకాండపై జనసేన అధినేత, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. వాడుకుని వదిలేశారన్న ఆవేదన కాపుల్లో ఉందని ఆయన చెప్పారు. ప్రభుత్వం కాపులతో చర్చలు జరిపి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తే సంతోషమని చెప్పారు. కాపులకు నమ్మకం కలిగించడంలో ప్రభుత్వం విఫలమైందని పవన్ విమర్శించారు. ఉద్యమ నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. తాను ఓ కులం కోసం పోరాడనని, ప్రజల కోసం ఉద్యమించేందుకే జనసేన పార్టీని పెట్టానని పవన్ చెప్పారు
రైలు తగలబెట్టడం బాధ కలిగించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైలు తగటబెట్టడం మామూలు విషయం కాదని, దీనిపై పోలీసులు విచారణ జరపాలని ఆయన కోరారు. మిగతా బీసీ కులాలకు నష్టం కలగకుండా కాపులకు న్యాయం చేయాలని ఆయన అన్నారు. రిజర్వేషన్లు ఒక్క రోజులో రావడం అసాధ్యమని, అందరూ సంయమనంతో వ్యవహరించాలని పవన్ కోరారు. ఉద్యమ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని ఆయన సూచించారు. అసాంఘిక శక్తులు లేనిదే ఇలాంటి ఘటనలు జరగవని పవన్ అనుమానం వ్యక్తం చేశారు. మొత్తమ్మీ ద పవన్ రియాక్షన్  కాపుల ఆవేశం మీద నీళ్ళు చల్లినట్టు కనబడుతోంది . 





No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...