Tuesday, December 9, 2014

గూగుల్‌ గ్రేట్‌ ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఫెస్టివల్‌ ప్రారంభం

న్యూఢిల్లీ,డిసెంబర్ 10; గూగుల్‌ గ్రేట్‌ ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఫెస్టివల్‌ (జీఓఎస్‌ఎఫ్‌)  మొదలైంది . 2012 నుంచి ఏటా గూగుల్‌ నిర్వహిస్తోన్న.. ఈ ఆన్‌లైన్‌ కొనుగోళ్ళ పండగ 12 వరకు జరగనుంది. ఇంతకుముందు ప్రకటించనట్లుగానే. నెక్సస్‌ 6 అమ్మకాలను కూడా ఈ రోజు నుంచే కంపెనీ మొదలు పెట్టింది .. ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే లభ్యం కానున్న ఈ ఖరీదైన స్మార్ట్‌ఫోను.. 32 జీబీ, 64 జీబీ రకాల్లో లభ్యంకానుంది. వీటి ధరలు వరుసగా రూ.43,999, రూ.48,999. జీఓఎస్‌ఎఫ్‌లో భాగంగా.. నెక్సెస్‌ 6, క్రోమ్‌కాస్ట్‌ (ధర రూ.2,999)తో పాటు లెనోవో, ఏషియన్‌ పెయింట్స్‌, టాటా హౌసింగ్‌, వ్యాన్‌ హ్యూసెన్‌ తదితర కంపెనీలకు చెందిన కొన్ని ఉత్పత్తులను మంగళవారం గూగుల్‌ విడుదల చేసింది. '2012లో మొట్టమొదటసారిగా నిర్వహించిన జీఓఎస్‌ఎఫ్‌లో 90 విక్రయ కంపెనీలు పాలుపంచుకున్నాయి. ఈసారి ఆ సంఖ్య 450కు చేరింది. ఆన్‌లైన్‌ కొనుగోళ్ళ విషయంలో భారత వినియోగదారుల విశ్వాసం రోజురోజుకూ పెరుగుతోంది. గత కొద్ది వారాల్లో 50 లక్షల మందికి పైగా జీఓఎస్‌ఎఫ్‌.ఇన్‌ వెబ్‌సైట్‌ను సందర్శించార'ని గూగుల్‌ ఇండియా ఎండీ రాజన్‌ ఆనందన్‌ తెలిపారు. ఈ సారి  జీఓఎస్‌ఎఫ్‌లో తాము కూడా పాల్గొంటున్నామని టాటా హౌసింగ్‌ తెలిపింది. బెంగళూరుతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఏడు ఇతర ప్రాజెక్టులకు చెందిన గృహాలను ఈ ఆన్‌లైన్‌ కొనుగోళ్ళ పండగలో విక్రయించనున్నట్లు పేర్కొంది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...