Monday, December 8, 2014

కర్నాటక సంగీత విద్వాంసుడు నేదునూరి కన్నుమూత

విశాఖపట్నం, డిసెంబర్  8; ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసుడు, ‘సంగీత కళానిధి’ నేదునూరి కృష్ణమూర్తి (87)  సోమవారం విశాఖలో కన్నమూశారు. 1927 అక్టోబర్ 10వ తేదీన తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి గ్రామంలో నేదునూరి జన్మించారు. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం, కంచి కామకోటి పీఠం ఆస్థాన సంగీత విద్వాంసుడిగా కూడా పనిచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమయ్య ప్రాజెక్టులో ఆయన అన్నమయ్య కృతులకు స్వరాలను సమకూర్చారు. పలు అవార్డులు, గౌరవ పురస్కరాలు అందుకున్నారు.  మద్రాసు సంగీత అకాడమీ ఆయనను ‘సంగీత కళానిధి’ బిరుదుతో సత్కరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నేదునూరి కృష్ణమూర్తి 1995లో కళానీరాజనం పురస్కారం అందుకున్నారు. నేదునూరి కృష్ణమూర్తి అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి అయ్యన్నపాత్రుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు, శాసనమండలి ఛైర్మన్‌ చక్రపాణి, డిప్యూటీ ఛైర్మన్‌ సతీశ్‌కుమార్‌ రెడ్డి కృష్ణమూర్తి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. రాష్ట్రంలోని పలు సంగీత కళాశాలలు, అన్నమాచార్య ప్రాజెక్టు ద్వారా నేదునూరి అందించిన సేవలను కొనియాడారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...