Monday, December 8, 2014

ఎ.పి. రాజధాని భూ సమీకరణ కు రంగం సిద్ధం

హైదరాబాద్‌,డిసెంబర్ 8; ఎ.పి.  రాజధాని  భూ సమీకరణ  ప్రక్రియ మంగళవారం నుంచి మొదలవుతుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. రాజధాని భూసమీకరణపై ఆయన విధాన ప్రకటన చేశారు.  రైతులు, రైతు కూలీలు అందరికీ పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా విధానం చేపట్టినట్లు తెలిపారు.మెట్ట రైతులకు ఎకరాకు నివాసయోగ్య ప్రాంతంలో వెయ్యి గజాలు, వాణిజ్య ప్రాంతంలో 200 గజాలు ఇస్తామని, జరీబు భూములకు నివాస యోగ్యం వెయ్యి, వాణిజ్యం 300 గజాలు ఇస్తామని, అసైన్డ్‌ భూములకు నివాసయోగ్యం 800 గజాలు, వాణిజ్యం 200 గజాలు ఇస్తామని చెప్పారు. ఏటా మెట్టలో ఎకరాకు రూ.30వేలు, జరీబుకు రూ.50వేల పరిహారం ఇస్తామని, భూ సమీకరణ ప్రాంతం రైతులందరికీ ఒకేసారి రుణమాఫీ ఎక్కడ భూమి తీసుకుంటే అదే జోన్‌లో భూమి కేటాయిస్తామని, మెట్ట ప్రాంతంలో ఉండే రైతుకు మెట్టలో, జరీబు రైతుకు అదే భూమి ఇస్తామని, మౌలిక వసతులన్నీ ఏర్పాటు చేసి భూమి అప్పగిస్తామని వివరించారు . ఇళ్లులేని వారు, రహదారుల విస్తరణలో ఇళ్లు కోల్పోయే వారికి ఇళ్లు కట్టిస్తాం. గ్రామకంఠంలో ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ చేసి పట్టాలు ఇస్తాం. భూ సమీకరణ ప్రాంతంలో అందరికీ ఉచిత విద్య, వైద్య సౌకర్యం కల్పిస్తాము .  ప్రస్తుతం భూముల్లో ఉన్న పంటలు రైతులకే చెందుతాయి. భూముల రిజిస్ట్రేషన్లను ఆపం. నిమ్మ, సపోటా, జామ తోటల రైతులకు ఎకరాలకు రూ. 50వేల అదనపు సాయం ఇస్తాము. దేవాదాయ శాఖ భూములు ఉంటే దేవాలయాలకే భూమి ఇస్తాం. దేవాలయాలకు అన్యాయం జరగకుండా రైతుల తరహాలోనే పరిహారం. శ్మశానాలు, ప్రార్థనాస్థలాలకు ప్రాధాన్యమిస్తాం డబ్బు ఉన్న రైతులకు పారిశ్రామికవేత్తలుగా శిక్షణ ఇస్తాము. భూములిచ్చేందుకు రైతులు అంగీకార పత్రం ఇవ్వాలి. రాజధాని ప్రాంతాన్ని మూడు భాగాలుగా తీసుకున్నాం. ఇన్నర్‌ రింగ్‌ 75 కి.మీ. లోపు. మిడిల్‌ రింగ్‌ 125 కి.మీ. లోపు అవుటర్‌ రింగ్‌ 200 కి.మీ.లోపు గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో భూముల సమీకరణ జరుగుతుందని చంద్ర బాబు వివరించారు . 


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...