Saturday, October 27, 2012

ఏడుగురికి ఉద్వాసన...రాష్ట్రం నుంచి ఐదుగురు...?

న్యూఢిల్లీ,అక్టోబర్ 27:కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో రాష్ట్రం నుంచి ఐదుగురిని తీసుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం. తెలంగాణకు చెందిన పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ, ఉత్తర కోస్తా నుంచి కిల్లి కృపారాణి లకు  మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలున్నాయి. కాగా, చిరు, కోట్ల సూర్య ప్రకాశ రెడ్డి, బలరాం నాయక్ ల పేర్లు ఇంతకె మందే ఖారయ్యాయి.  సర్వే సత్యనారాయణకు సహాయ మంత్రి హోదా ఇచ్చి సామాజిక న్యాయశాఖను కేటాయించే అవకాశం ఉంది. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి రైల్వే శాఖ సహాయ మంత్రి పదవి దక్కనుంది.కిల్లి కృపారాణికి ఆరోగ్య శాఖ సహాయ మంత్రి పదవి దక్కనుంది. చిరంజీవికి పర్యాటక శాఖను అప్పగించి స్వతంత్ర హోదా ఇస్తారని సమాచారం. బలరాం నాయక్‌కు గిరిజన శాఖ సహాయ మంత్రిపదవి ఇవ్వచ్చు.

ఏడుగురి  రాజీనామా

  కేంద్రం మంత్రి వర్గం నుంచి ఏడుగురుమంత్రులు రాజీనామా చేశారు. ఎస్.ఎం.కృష్ణ, అంబికాసోనీ, సుభోద్ కాంత్ సహాయ్, ముకుల్ వాస్నిక్, మహదేవ్ సింగ్ ఖండేలా,అగథా సంగ్మా ,విన్సెంట్ పాల రాజినామాలను ప్రధాని అమోదించారు.  ఎస్.ఎం.కృష్ణ, ముకుల్ వాస్నిక్ లకు పార్టీ పదవులు అప్పగించే అవకాశం ఉంది. ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆంతరంగిక బృందంలోకి అంబికాసోనీని తీసుకుంటారని తెలుస్తోంది.సుభోద్ కాంత్ సహాయ్ బొగ్గు స్కాంతో పదవిని కోల్పోయారు.  ఆరుగురు సీనియర్ మంత్రుల శాఖలలో కోత విధిస్తారు. రెండేసి శాఖలు ఉన్నవారి వద్ద నుంచి ఒక శాఖని తొలగిస్తారు. సచిన్ పైలట్, జ్యోతిరాదిత్య, మిలింద్ దేవరాలకు ప్రమోషన్ ఇస్తారు. రాహుల్ గాంధీ బృందంలోని  మానికా టాగోర్, మీనాక్షి నటరాజన్ లకు మంత్రి పదవులు దక్కనున్నాయి. బెంగాల్ నుంచి ఎ.హెచ్.ఖాన్ చౌదరికి, కేరళ నుంచి కె.సురేష్ కు, ఎన్ సీపీ నుంచి తారిఖ్ అన్వర్ కు మంత్రి వర్గంలో స్థానం లభించనుందని సమాచారం. ఆనంద్ శర్మకు ప్రమోషన్ ఇస్తారు. కపిల్ సిబల్ శాఖలు యథాతథంగా ఉంటాయి. మునియప్పకు స్వతంత్ర హోదా ఇస్తారు. కమల్ నాథ్‌కు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ అప్పగిస్తారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...