Saturday, October 27, 2012

కావూరి అలక: ఢిల్లీ బుజ్జగింపు

న్యూఢిల్లీ,అక్టోబర్ 27:  కేంద్ర మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ రాష్ట్ర కాంగ్రెస్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది.మంత్రి వర్గంలో స్థానం లభిస్తుందని ఆశించిన  ఏలూరు కాంగ్రెస్ ఎంపి కావూరి సాంబశివరావు  జాబితాలో తన పేరు లేదని తెలిసి రాజీనామాకు సిద్దపడ్డారు.  లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ కు, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఆయన ఫ్యాక్స్ ద్వారా  రాజీనామా లేఖలు పంపారు. ఆయన అయిదుసార్లు ఎంపిగా గెలిచారు. సీనియార్టీని, విధేయతని నిర్లక్ష్యం చేశారని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, నిరాశతో రాజీనామా చేసిన కావూరి సాంబశివరావును ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారుడు అహ్మద్ పటేల్ బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలో గుర్తింపు ఉన్న హోదా ఇస్తామంటూ అహ్మద్ పటేల్ నచ్చచెబుతున్నప్పటికీ కావూరి మాత్రం తనకు కేంద్ర మంత్రి పదవి కావాలని పట్టుబడుతున్నట్టు సమాచారం.మరోవైపు గుంటూరు కాంగ్రెస్ ఎంపి రాయపాటి సాంబశివరావు కూడా కావూరి బాటలోనే నడిచే సూచనలు కనిపిస్తున్నాయి. సీనియర్ ఎంపి రాయపాటి టిటిడి చైర్మన్ పదవిని చాలా కాలం నుంచి ఆశించారు. కానీ   ఆ పదవి దక్కకఆయన కూడా తీవ్ర అంసతృప్తితో ఉన్నారు.
 
    


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...