Wednesday, October 31, 2012

రిలయన్స్‌పై కేజ్రీవాల్ ధ్వజం

న్యూఢిల్లీ,అక్టోబర్ 31: కాంగ్రెస్, బీజేపీలు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ అధినేత ముకేష్ అంబానీ జేబు సంస్థలుగా పనిచేస్తున్నాయని ఇండియా అగెనైస్ట్ కరప్షన్ సభ్యుడు అరవింద్ కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. కృష్ణా-గోదావరి బేసిన్ గ్యాస్ నిక్షేపాల విషయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ దాదాగిరి చేస్తోందని.. గ్యాస్ ధర పెంపు కోరుతూ ఉత్పత్తిని, సరఫరాను తగ్గించి వేస్తూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. రిలయన్స్ కేజీ బేసిన్ గ్యాస్ కాంట్రాక్టును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేజీ బేసిన్‌ ను ఓఎన్‌జీసీ కానీ, గ్యాస్‌ను తక్కువ వ్యవధిలో చౌకగా సరఫరా చేసే సంస్థలకు కానీ కేటాయించాలన్నారు. కేజీ బేసిన్ కాంట్రాక్టు వ్యవహారం పైన, గ్యాస్ ధరను పెంచడానికి రిలయన్స్ అధినేత అంబానీ తెస్తున్న ఒత్తిళ్లపై కాగ్ ద్వారా దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.  టెలికం మంత్రిని టాటా, పెట్రోలియం మంత్రిని ముకేష్ అంబానీలు నియమిస్తున్నారని ఎద్దేవా చేశారు.కేంద్ర ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో ప్రణబ్ ముఖర్జీ రిలయన్స్‌కు రూ. 10 వేల కోట్లు లాభం చేకూర్చారని ఆయన ఆరోపించారు. ‘‘యూనిట్ గ్యాస్‌ను 4.25 డాలర్ల ధరకు సరఫరా చేస్తామన్న రిలయన్స్ డిమాండ్‌కు ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల సాధికార బృందం అనుమతి ఇచ్చింది’’ అని ఆరోపించారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...