Wednesday, October 31, 2012

50 దాటిన శాండీ మృతులు...

న్యూయార్క్ , అక్టోబర్ 31:  అట్లాంటిక్‌ మహా సముద్రంలో పుట్టిన అతిపెద్ద హరికేన్‌ శాండీ వల్ల అమెరికాలో మృతుల సంఖ్య 50 దాటింది. ఒక్క న్యూయార్క్ లోనే 18 మంది మృతి చెందారు. 80 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. న్యూయార్క్ లోని  చాలా ఇళ్లలోకి వరదనీరు చొచ్చుకొని వచ్చింది.   18 వేల విమానాలను రద్దు చేశారు. శాండీ తుపాను కారణంగా వర్జీనియా లో పలుచోట్ల భారీగా మంచు కురిసింది. సబ్ వేలు తెరవాలంటే ఎన్నిరోజులు పడుతుందో చెప్పలేమని అధికారులు అంటున్నారు. అలాగే మొత్తం కరెంట్ సరఫరా పునరుద్ధరణకు   మరో రెండు మూడు రోజులు పట్టే అవకాశం ఉంది. కాగా, వాల్ స్ట్రీట్ లో ట్రేడింగ్ తిరిగి ప్రారంభమైంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...