Wednesday, October 31, 2012

రాష్టానికి తప్పిన తుఫాను గండం

హైదరాబాద్, అక్టోబర్ 31: రాష్టానికి నీలం తుఫాను గండం తప్పింది. మహాబలిపురం వద్ద తుఫాను తీరాన్ని దాటింది.  తుఫాను తీరాన్ని దాటిన సమయంలో మహాబలిపురం వద్ద గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. మహాబలిపురం వద్ద దాదాపు 4వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాను వల్ల  రాష్ట్రానికి ఏ విధమైన నష్టం వాటిల్లలేదని,  రెవెన్యూ  మంత్రి రఘువీరా రెడ్డి తెలిపారు.  ఈ తుఫాను వల్ల  61 మండలాల్లో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఆయన తెలిపారు. తుఫాను సహాయక చర్యల్లో భాగంగా 47 మంది జాతీయ విపత్తు స్పందన బృంద సభ్యులను నెల్లూరుకు పంపినట్లు తెలిపారు. చిత్తూరు, నెల్లుూరు జిల్లాల్లో గతంలో పనిచేసిన సీనియర్ ఐఎఎస్ అధికారులను ప్రత్యేక అధికారులుగా పంపించినట్లు ఆయన తెలిపారు.

 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...