Monday, October 29, 2012

శాండీ గుప్పెట్లోఅమెరికా తూర్పు తీరం

వాషింగ్టన్, అక్టోబర్ 29 : కరేబియన్‌ దీవుల్లో పెను విధ్వంసం సృష్టించి 60 మందిని బలితీసుకున్న శాండీ హరికేన్‌ ఇప్పుడు అమెరికాను వణికిస్తోంది. భీకర ఉప్పెనగా  దేశ తూర్పు తీరంపై విరుచుకుపడబోతోంది. శాండీ ప్రళయాన్ని తట్టుకునేందుకు ఒబామా ప్రభుత్వం న్యూయార్క్‌తో పాటు డెలవేర్‌, న్యూజెర్సీ, కనెక్టికట్‌ వంటి ఇతర ప్రాంతాలు, నగరాల్లో ఎమర్జెన్సీ విధించింది. 30 సెంటీమీటర్ల మేర కుంభవృష్టి కురుస్తుందని గంటకు 135 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని హరికేన్‌ సెంటర్‌ హెచ్చరించింది.శాండీ తీరాన్ని సమీపించే సమయంలో అట్లాంటిక్‌ మహాసముద్ర అలలు సాధారణ స్థితి కంటే 4  నుంచి 8 అడుగుల ఎత్తు వరకు ఎగసిపడే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల నుంచి 3.75 లక్షల మందిని ఖాళీ  చేయించారు.  ముందు జాగ్రత్త చర్యగా న్యూయార్క్‌లోని సబ్‌వేలను మూసివేశారు. బస్సులు, ట్రామ్స్‌ వంటి  ప్రజారవాణా సేవలను నిలిపివేశారు. న్యూయార్క్ నుంచి పలు విమానాలు కూడా రద్దయ్యాయి.   స్కూళ్లకు సెలవు ప్రకటించారు. న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో . ఫిజికల్‌ ట్రేడింగ్‌ను నిలిపేశారు.  1985 తర్వాత స్టాక్‌ మార్కెట్లు మళ్లీ వాతావరణం వల్ల మూత పడడం ఇదే ప్రధమం.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...