Wednesday, October 17, 2012

గడ్కరీ పరమ అవినీతిపరుడు..చిట్టా విప్పిన కేజ్రీవాల్

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: : అవినీతి వ్యతిరేక ఉద్యమం చేస్తున్న అరవింద్ కేజ్రీవాల్ బుధవారం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ అవినీతి చిట్టా విప్పారు.  కేంద్రమంత్రి సల్మాన్ ఖుర్షీద్‌ను తొలి విడతగా టార్గెట్ చేసిన కేజ్రీవాల్ ఈసారి గడ్కరీ అవినీతి ని బయటపెట్టారు. గడ్కరీని  రాజకీయ నాయకుడు అనడం కంటే మంచి వ్యాపారవేత్త అనడం సబబు అన్నారు. మహారాష్ట్రలో గడ్కరీకి పెద్ద వ్యాపార సామ్రాజ్యం ఉందని ఆరోపించారు. మహారాష్ట్ర నీటిపారుదల కుంభకోణంలో గడ్కరీ పాత్ర కూడా ఉందని ఆరోపించారు. శరద్ పవార్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని గడ్కరీయే చెప్పారన్నారు. గతంలో ప్రాజెక్టు కోసమని సేకరించిన భూమిలో చాలా మిగిలి పోయిందని, మిగిలిన ఆ భూమిని తనకు అప్పగించాలని రైతులు 2002లో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారని, అయితే ప్రభుత్వం మాత్రం వారి విజ్ఞప్తులను పట్టించుకోలేదన్నారు. 2005లో గడ్కరీ ఆ భూములను తనకు ఇవ్వాల్సిందిగా లేఖ రాస్తే విలాస్ రావు దేశ్ ముఖ్ ప్రభుత్వం కట్టబెట్టిందన్నారు. నాగపూర్ రైతుల భూములను గడ్కరీకి ప్రభుత్వం ధారాదత్తం చేసిందన్నారు. రైతుల ప్రాణాలు ఫణంగా పెట్టి గడ్కరీ మహా ప్రభుత్వం నుండి ప్రయోజనం పొందారని ఆరోపించారు. విదర్భ రైతుల దుస్థితికి ఆయనే కారణమన్నారు. మహారాష్ట్ర  ప్రభుత్వం నుండి గడ్కరీ చాలా ప్రయోజనాలు పొందారని చెప్పారు. గడ్కరీకి ఐదు చక్కెర కర్మాగారాలు, మూడు విద్యుత్ పరిశ్రమలు ఉన్నాయని చెప్పారు. విద్యుత్, చక్కెర పరిశ్రమలకు ప్రభుత్వం అక్రమంగా నీటిని ఇచ్చిందని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా భూములు కేటాయించారన్నారు. గడ్కరీకి వంద ఎకరాల భూమిని అక్రమంగా కేటాయించారని విమర్శించారు. మహారాష్ట్ర  ప్రభుత్వంతో గడ్కరీ తన ప్రయోజనాల కోసం కుమ్మక్కయ్యారన్నారు. గడ్కరీ విద్యుత్ పరిశ్రమల కాలుష్యం పైన ఫిర్యాదు చేసినా పట్టించుకో లేదన్నారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...