సచిన్‌కు ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియాలో సభ్యత్వం
న్యూఢిల్లీ, అక్టోబర్ 16 మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం సచిన్ కు ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా లో సభ్యత్వాన్ని కల్పించింది. దీనికి సంబంధించి ఆ దేశ ప్రధాని జూలియా గిల్లార్డ్ ప్రకటన చేశారు. త్వరలో భారత్‌లో పర్యటించనున్న ఆస్ట్రేలియా క్యాబినెట్ మినిస్టర్ సైమన్ క్రీన్ ఈ గౌరవాన్ని ప్రదానం చేస్తారు. అసాధారణ సేవలందించిన ప్రముఖులను లేదా ఆస్ట్రేలియా పౌరులను ఈ గౌరవంతో సత్కరిస్తారు. ఆరు గ్రేడ్లు ఉన్న ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియాలో సచిన్‌ను సభ్యత్వంతో గౌరవించనున్నారు. గతంలో ఈ గౌరవాన్ని అందుకున్న క్రికెటర్లలో బ్రియాన్ లారా ఉన్నారు. వెస్టిండీస్‌కు చెందిన క్లైవ్ లాయిడ్ ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియాలో ఆఫీసర్‌గా గౌరవం పొందారు.
Comments